రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయడుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎర్రగొండపాలెం ఇన్చార్జ్ గూడూ రి ఎరిక్షన్‌బాబు అన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ చేపట్టిన ‘చైతన్య రధయాత్ర’ ఆదివారం సాయంత్రం మండలంలోని చిన్నగుడిపాడు గ్రామానికి చేరుకొంది. అక్కడ ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రావడానికి మోసపు మాటలు చెప్పిందన్నారు. నవరత్నాలంటూ ప్రజలను ఏమార్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అనంతరం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిం దన్నారు. ఇక టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను చూసి వైసీపీ పాలకుల్లో వణుకు ప్రారంభమైందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లందించడం, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించను న్నట్లు చంద్రబాబు ప్రకటించారన్నారు. ఈ ప్రాంతం మంత్రి నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు.