కడప జిల్లా, మదనపల్లె పట్టణ పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలించి యువత జీవితాలను బాగు చేయాలని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ విన్నవించారు. ఆ మేరకు ఆదివారం స్థానిక టు టౌన పోలీసు స్టేషనలో సీఐ మురళికృష్ణకు తెలుగు యువత నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరుణ్తేజ మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని, దీంతో యువత మత్తుకు బానిసై గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిపోతున్నారన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత భవిష్యత మనుగడ సాధించడం కష్టమ న్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, దివ్యకుమార్‌రెడ్డి, షేక్ బావాజాన, శివకృష్ణ, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.