వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్లు తీసుకొస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి వారి గొంతు కోశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు అందాల్సిన రూ. 45వేల రుణాలను రద్దు చేశారని ఆరోపించారు. కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు కాపు నేస్తం అంటూ కొత్త మోసానికి తెరలేపారని దుయ్యబట్టారు.