ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సురక్షా పథకంపై నక్కా సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 04:11 PM

జగనన్న సురక్ష కార్యక్రమంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సురక్షా కార్యక్రమం వల్ల వైసీపీ నేతలకే సురక్షా.. పేదలకు కాదు. గడపగడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు ఎదురయ్యాయి. జగన్ రక్షణ కోసమే సురక్షా కార్యక్రమం. రక్ష.. సురక్షా కార్యక్రమాలు జగన్‌ను రక్షించ లేవు. కరోనాను అడ్డం పెట్టుకుని కూడా వైసీపీ నేతలు దోచుకున్నారు. ఏపీలో ప్రజలు సురక్షితంగా ఉన్నారా..? ఈరోజు ఓ సంఘటన జరిగితే.. మర్నాడే మరో సంఘటన జరుగుతోంది.. ఇంకేం సురక్ష. అధికార పార్టీ ఎంపీకే రక్షణ లేదు.. ఇంకేం సురక్ష.’’ అంటూ ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com