జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి మదనపల్లె బీటీ కాలేజీ మైదానంలో జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవనకళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు హలో ఏపీ..బై బై వైసీపీ అనే నినాధాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు పోతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివ రిస్తూ..తమ అధినేత పవనకళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవ శ్యకతని తెలియచేస్తున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రాబోయే ఎన్నికలలో మదనపల్లె నియోజకవర్గ ప్రజలు జనసేనకు మద్ధతు ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగం నేత అడపా సురేంద్ర, ఐటీ విభాగ నేతలు జగదీష్, మోహన, లక్ష్మీపతి, కుమార్, నాగ, నగేష్, అర్జున, వేణు పాల్గొన్నారు.