మంత్రి అంబటి రాంబాబుపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సీనియర్‌గా కనబడటం కోసం అంబటి తలకు రంగు కూడా వేయడం లేదన్నారు. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న అంబటి.. జనసేన పార్టీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖకు న్యాయం చేయలేని అంబటి.. నీటి పారుదల శాఖ మంత్రి కాదు.. నోటి పారుదల శాఖ మంత్రి అంటూ దుయ్యబట్టారు. వారాహి గురించి ఏదిపడితే అది మాట్లాడం మంత్రి అంబటికి సరికాదని సూచించారు. పవన్‌పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపై కౌన్సిలర్లు ఆరోపణ చేసిన అంబటికి సిగ్గు రాలేదని వ్యాఖ్యానించారు. సత్తెనపల్లి నుంచి జనసేన పోటీలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.