రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి భీమునిపట్నం నియోజకవర్గంలో చేపట్టవలసిన కార్యాచరణపై 5వ వార్డ్ మాజీ కార్పొరేటర్ వార్డ్ అధ్యక్షులు పోతిన. హనుమంతరావు సోమవారం గృహ సారథులు కన్వీనర్లతో సుమారు 200 మందితో చర్చించారు. సచివాలయం పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వివరాలతో సిబ్బంది సిద్ధంగా ఉండాలని హనుమంతరావు ఆదేశించారు. అలాగే జగనన్న సురక్ష యాప్ గురించి సచివాలయ సిబ్బంది గృహ సారథులు, కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారికి అందాల్సిన సంక్షేమపథకాలకు సంబంధించి వివరాలను ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని అలాగే భీమిలి నియోజవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి తీరని సమస్యలు కూడా వెంటనే తీరుస్తున్న అవంతి శ్రీనివాసరావుని మళ్లీ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని భీమిలి నియోజకవర్గం లో వైసీపీ జెండా ఎగర వెయ్యాలని హనుమంతరావు ప్రతి ఒక్కరికి ఆదేశించారు.