విశాఖ నగరంలోని పాత గాజువాక జంక్షన్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ‘‘భవిష్యత్‌కు గ్యారంటీ’’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, అనిత, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు చిరంజీవి రావు, దువ్వారపు రామారావు, ఉమ్మడి విశాఖ టీడీపీ నేతలు హాజరయ్యారు. బహిరంగ సభ అనంతరం బస్సు యాత్ర ప్రారంభంకానుంది. బహిరంగ సభలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసగించారని మండిపడ్డారు. ఇలాంటి సీఎం విశాఖకు రావాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. జగన్ పచ్చి మోసగాడని వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు.