రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమీ బాగోలేదని టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేవని.. మనం రాష్ట్రంలో ఉన్నామా?.. రావణ కాష్టంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. విశాఖలో గంజాయి, గన్ కల్చర్ పెరిగిపోయాయని తెలిపారు. పోలవరం ప్రాజక్టు పనులు 72 శాతం టీడీపీ హయంలో జరిగాయన్నారు. పోలవరం పట్ల వైసీపీ నిర్లక్ష్యము కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని తెలిపారు. టీడీపీ మినీ మ్యానిఫెస్టోపై ప్రజలు చర్చించి మద్దతు ఇవ్వాలని కోరారు.