మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి అనేక ఉద్యమాలు, ఆందోళనల్లో సొలిపేట పాల్గొన్నారని గుర్తుచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గ్రామసభ నుంచి రాజ్యసభ వరకు ఎదగడం... సర్పంచి నుంచి ఎంపీ వరకు చేపట్టిన ప్రతి పదవికి వన్నెతెచ్చారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామచంద్రారెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు.