పోలవరం నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జంక్షన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పోలవరం నిర్వాసితుల సంఘీభావ నిధి సేకరించారు. సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర సోమవారం మాట్లాడుతూ తమ జీవితాలను త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.