జంఝావతి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తికి ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా సమితి అధ్యక్ష, కార్యదర్శిలు వారాడ శ్రావణ్ కుమార్, బుడితి అప్పలనాయుడులు విజ్ఞప్తి చేశారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి అయితే సంవత్సరానికి మూడు పంటలు పండించుకోవడానికి కావలసినంత నీరు ఉందన్నారు. ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.