నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. బలపాలతిప్ప గ్రామంలో ఓ ఆవును పెద్దపులి చంపిందని స్థానికులు తెలిపారు. కాగా పెద్దపులి సంచారం వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతూ రాత్రి వేళల్లో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పెద్దపులి సంచారం వార్తను అటు అటవీ అధికారులకు, ఇటు స్థానిక పొలీసులకు గ్రామస్తులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa