ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం రస్తా కుంటుబాయి శాస్త్ర వేత్తలు కోటవానివలస, సింగనాపురం, లక్ష్మిపురం గ్రామాలను సందర్శించారు. గేదెలలో పాల ఉత్పత్తి పెరగడం కోసం ప్రోబయోటిక్ ఔషదం, ఖనిజ లవణ మిశ్రమాలను రైతులకు అందజేశారు. బాహ్య పరాన్న జీవులు నిర్మూలన కోసం మొక్కల నుండి కసాయాన్ని తయారీ చేసే విధానం తెలియచేశారు. కార్యక్రమంలో డా. పాత్రొ, డా అను సంవర్ధక సిబ్బంది పాల్గున్నారు