జులై 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహిదామని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా స్థానిక కలెక్టరేట్ సమావేశం నందు జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఆర్ఓ. యన్. రాజశేఖర్ తో కలిసి జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కేంద్రం పర్యటనకు సంబంధించి వివిధ శాఖ అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్. జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుందని, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు వారి వారి కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.