తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అయన మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ కుట్ర బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 13వ తేదీన కిడ్నాప్ అయితే.. 15వ తేదీ వరకు పోలీసులకు తెలియలేదంటే.. ఎంపీ ఈ కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పలేదంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇంత వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.