విద్యుత చార్జీలు పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా, గుత్తి స్థానిక విద్యుత డివిజన కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక పత్తికొండ రోడ్డు నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డివిజన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కరెంట్ బిల్లులతో జనాలకు జగన ప్రభుత్వం షాక్ ఇస్తోందన్నారు. రానున్న రోజుల్లో స్మార్ట్ మీటర్లతో మరో ముప్పు తెచ్చిపెట్టేందుకు సిద్ధమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు మండిపడ్డారు. అనంతరం ఈఈ రాజశేఖర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు రామదాసు, రామకృష్ణ, నిర్మల, రమేష్, మల్లికార్జున, కవిత, మద్దిలేటి, మాబు, రాముడు, ఆశోక్, రఫీ పాల్గొన్నారు.