చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప అభివృద్ధి శూన్యమని, అవినీతిలో చంద్రబాబుకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వొచ్చని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే ధనవంతులయ్యారని, నిరుపేదలు అలాగే మిగిలిపోయారన్నారు. నెల్లూరులో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ఇసుకపై చంద్రబాబు రూ.4 వేల కోట్లు అక్రమంగా సంపాదించాడన్నారు. చంద్రబాబు సైకో, శాడిస్టు కాబట్టే ప్రశ్నించేవారిని గుర్రాలతో తొక్కించాడని గుర్తుచేశారు.