ప్రతిష్టాత్మక ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో విశాఖ జిల్లా తగరపువలసకి చెందిన వెంపాడ శ్రీనివాస రెడ్డికి స్థానం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా వెంపాడ శ్రీనివాసరెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకి గాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్స్ జయీష్ భట్, మహిమా జైన్ ల చేతుల మీదుగా దీనికి సంబంధించిన ప్రశంసాపత్రం, మెమొంటో లను వెంపాడ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. భారతదేశంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులతో పాటు తనకు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కలిపించడం పట్ల వెంపాడ శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తన సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డ్ తో బాధ్యత మరింత పెరిగిందని, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని ఆయన చెప్పారు. ఇక్కడకు వచ్చిన వివిధ రంగాల ప్రముఖులతో పరిచయం ఈ అవార్డ్ కన్నా ఎంతో విలువైనదని వెంపాడ అన్నారు. తన సేవలను గుర్తించి ఈ అవార్డ్ కు ఎంపిక చేసిన ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు మంగళవారం తెలియజేశారు.