ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని 10 మంది ఐఏఎస్ ప్రొబేషనర్స్ (ఏపీ క్యాడర్ అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ ట్రైనింగ్ 2022 బ్యాచ్) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సీఎం వైయస్ జగన్ వారికి మార్గనిర్దేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు.