ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణంలో మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తించడమే. లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే మళ్లీ వైరల్ అయింది. మెట్రోలో రెచ్చిపోయిన ఓ ప్రేమ జంటను చూసి ఇద్దరు మహిళలు అడ్డుకున్నారు. ఏంటా పాడు పని అని నిలదీశారు. దాంతో ఫైర్ అయిన యువకుడు ఆంటీలతో వాదనకు దిగాడు. ఏం తప్పు చేస్తున్నామని దబాయించాడు.