దేశంలో మరో 5 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్ నుంచి 5 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగుభాయ్ సి పటేల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపారు. తొలుత అక్కడ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.