బాలికను అత్యాచారం చేసి హతమార్చిన హంతకుడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పింది. ఫతేపూర్‌లో ఉన్న అతడి నివాసాన్ని జేసీబీ సాయంతో కూల్చివేసింది. ఘటన స్థలానికి ఎస్డీఎం, పోలీసులు, అధికారులు చేరుకుని ఇల్లును కూలగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 రోజుల క్రితం ఓ బాలికను నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడన్నారు. ఈ మేరకు అతడికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుందన్నారు. అతని ఇంటిని కూల్చివేయాలని ఆదేశాలు రావడంతో జేసీబీ సాయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.