పలనాడు జిల్లాలో టిడిపి చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ చైతన్య రథయాత్ర మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో ప్రారంభించారు. కారంపూడి మండల పరిధిలోని పేట సన్నగండ్ల గ్రామం వద్ద జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాజీ మంత్రి పత్రిపాటి పుల్లారావు యాత్రను ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నాయకులకు గజమాలతో కార్యకర్తలు స్వాగతం పలికారు.