కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నెల ప్రారంభంలో రూ.15 ఉన్న టమోటా ధర నేడు ఏకంగా రూ.100 దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల రూ.110కి కూడా విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా టమోటా 100 పైగా పలుకుతోంది. దీనితో పాటు పచ్చిమిర్చిని కూడా రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. చిక్కుడు రూ.100-150, బీర రూ.80, వంకాయ, బెండ, కాకర రూ.60-70, బీన్స్ రూ.120కి చేరి సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి.