వరుసగా నాలుగో ఏడాది అమ్మ ఒడి నిధులను జమ చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బటన్ నొక్కి సీఎం జగన్ ఒక్కొక్కరి ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తారు. వరుసగా పది రోజుల పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మందికి లబ్ధి చేకూరుతుంది.