ఏపీ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏళ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18 ఏళ్లకు 7.42 శాతం వడ్డీతో, మరో రూ.500 కోట్లు 16 ఏళ్లకు 7.43 శాతం వడ్డీతో తెచ్చింది. మొత్తంగా ఎఫ్ఆర్బీఎంలో జగన్ సర్కార్ ఈ ఏడాది రూ.22,500 కోట్ల అప్పు తెచ్చి రికార్డ్ సష్టించింది.