కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యం మహిళకు ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తమకు జరిగిన అన్యాయానికి న్యాయపోరాటం చేపట్టారు. ఈ ఘటనపై కోర్టులో కేసు వేయగా సదరు ఆసుపత్రి యాజమాన్యం వారికి రూ. 1.5 కోట్లు చెల్లించాలంటూ ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.