రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అధీకార వైసీపీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నెల్లూరు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.