యాదాద్రిలో కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆలయ పురవీధుల్లోకి పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తింది. వర్షం బారి నుంచి తలదాచుకునేందుకు భక్తులు తలా ఒక చోటుకు అన్నట్టుగా పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ కొద్దిపాటి వర్షానికే ఘాట్ రోడ్డు పూర్తిగా బురదమయం అయిపోయింది. దీంతో యాదాద్రి దర్శనానికి వచ్చిన భక్తులు. కోట్లు పెట్టి నిర్మించిన ఆలయంలో కనీస వసతులు లేకపోతే ఎలా అని విస్మయం వ్యక్తంచేశారు.