జగన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పాలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రవీంద్ర మాట్లాడుతూ, దళితులను హత్యలు చేయించి జగన్రెడ్డి డోర్ డెలివరీ చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. కూలి పనిచేసే వారిపైనా తమ ప్రభావం చూపిస్తున్నారన్నారని, కత్తులతో, కర్రలతో దాడులు జరుపుతూ దళిత జాతిపై జగన్రెడ్డి విషం కక్కుతున్నారన్నారు. దళితుల ఆస్తులు లాక్కొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందడం లేదన్నారు. దళితవాడల్లో పాఠశాలలు రద్దు చేయడం వల్ల పేద దళితుల పిల్లలు చదువులకు దూరమై పోతున్నారన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్రెడ్డి రాక్షస పాలనను ప్రజలు సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు.