విద్యుత్ చార్జీలు తగ్గించాలని పెదకూరపాడు నియోజకవర్గంలోని విద్యుత్ వినియోగదారులు కోరుచున్నారు. రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు రెట్టింపు పెరిగాయి. విద్యుత్తు వాడకానికే స్లాబులు మార్చటం జరిగింది. దీనివల్ల ధరలు పెరిగాయి. వీటితోపాటు 2014లో వాడుకున్న విద్యుత్తుకు ట్రూ అప్ పేరుతో చార్జీలు విధించారు. 2021లో వాడుకున్న విద్యుత్తుకు అదనపు చార్జీలు వడ్డించారు.