గుంటూరు జిల్లాలో సీపెట్లో 2023-24 విద్యా సంవత్సరానికి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ సంస్థ సంయుక్త సంచాలకులు శేఖర్ మంగళవారం తెలిపారు. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సులకు పదో తరగతి, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సుకు బీఎస్సీ విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.