వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించిన అమ్మ ఒడి నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తల్లుల ఖాతాలకు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో సీఎం బటన్ నొక్కి నగదును వేశారు. ఈ సందర్భంగా 42 లక్షల మంది తల్లులకు 6,392 కోట్లు రూపాయలు లబ్ధి చేకూర్చినట్టు సీఎం జగన్ తెలిపారు. పది రోజులపాటు ఈ కార్యక్రమం పండుగలా జరుగుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa