కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి ఉండగా. తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. మృతుడు వర్కాల వడస్సేరికోణంకు చెందిన రాజు(63)ను అతని పక్కింట్లో ఉండే జిష్ణు అనే యువకుడు, అతని స్నేహితులు కత్తులతో నరికి చంపారు. రాజు కుమార్తె శ్రీలక్ష్మి, జిష్ణులు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa