2019 నవంబరు 28న రాజమహేంద్రవరంలోని తాడితోటకు చెందిన బంగారు అయ్యప్ప, రాయి సింహాద్రి అప్పన్న, రాయి వెంకటేశ్వరరావు సీటీఆర్ఐ సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అష్టాచెమ్మ ఆడుకుంటున్నారు. సుబ్బారావునగర్కు చెందిన దడాల సత్యనారాయణ తన ఇంటికి వెళ్తూ వారి వద్ద ఆగి ఆట చూస్తున్నాడు. కాసేపటికి ఆ ముగ్గురు సత్యనారాయణ జేబులోని రూ.230 బలవంతంగా లాక్కున్నారు. దీనిపై ప్రశ్నించిన సత్యనారాయణను కర్రతో చితకబాదారు. ఆయన తలకు బలమైన గాయమైంది. ఈ కేసు విచారణ అనంతరం బంగారు అయ్యప్పకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, రాయి సింహాద్రి అప్పన్న, రాయి వెంకటేశ్వరరావుకు నాలుగేళ్ల్లు జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారని సీఐ తెలిపారు. ప్రాసిక్యూషన్ తరపున కోడి సతీశ్ నాయుడు వాదించారని, ఎస్ఐ జాన్ బాషా కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారన్నారు.