కాకినాడ జిల్లాలో గండేపల్లి, అన్నవరం పోలీస్స్టేషన్ల పరిధిలో మోటారు బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి నిందితులవద్ద నుంచి రూ.20.70 లక్షల విలువైన 41 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్ వివరాలను కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ వెల్లడించారు. జిల్లాలో ఇటీవల మోటార్‌బైక్‌ల చోరీలు తరచూ జరగడంతో వీటి నివారణకోసం ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. నిందితుల కోసం పెద్దాపురం ఎస్డీపీవో కె.లతాకుమారి ఆధ్వర్యంలో గండేపల్లి, అన్నవరం పోలీస్స్టేషన్ల పరిధిలో నిఘా పెట్టి పక్కా సమాచారంతో కొన్నిరోజులుగా గాలింపు చేయగా అన్నవరం, గండేపల్లి, సర్పవరం ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 41 మోటార్‌బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.19.70 లక్షలు కాగా, ఓ పాడిగేదె రివకరీ చేశారు.