జగన్ ప్రభుత్వం మొదలు పెట్టిన సమగ్ర భూ సర్వే జగన్ అండ్ కో భూ దోపిడీగా మారింది. లక్షల ఎకరాల భూములను దొంగ సర్వేల పేరుతో నిషేధ జాబితాలో పెడుతున్నారు. బెంబేలెత్తిపోయిన భూ యజమానుల నుంచి వాటిని కారు చౌకగా కొట్టేస్తున్నారు. ఇటీవలి కాలంలోనే రెండు లక్షల ఎకరాల భూమిని వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా స్వాహా చేశారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.