ఏలూరు జిల్లా వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ గద్దె తిరుపతయ్య (60) అనుమానాస్పద స్థితిలో ఆశాఖ కార్యాలయంలోని విశ్రాంతి గది బాత్రూమ్లో మృతి చెందారు. తెనాలి జిల్లా అమృతలూరి మండలం పేపర్రుకు చెందిన గద్దె తిరుపతయ్య వ్యవసాయశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన అనంతపురం నుంచి బదిలీపై ఈ నెల 3న ఏలూరు జిల్లాకు వచ్చి విధుల్లో చేరారు. అనంతరం ఆయన సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఈనెల 26న విధుల్లోకి చేరారు. అదే రోజు సాయంత్రం ఆశాఖ కార్యాలయంలో ఉన్న అతిథి గృహంలో ఉన్నారు. మరుసటి రోజు 27న విధులకు హాజరు కాలేదు. బుధవారం కూడా ఆయన విధులకు హాజరు కాలేదు. దీంతో బుధవారం ఉదయం వాచ్మన్ అతిఽథి గృహానికి వెళ్లాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో వెనుకవైపు కిటికీలోంచి చూడగా బాత్రూమ్లో ఆయన కాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం నుంచి దుర్గంధం రావడం ద్వారా మంగళవారం ఉదయం బాత్రూంలో గుండెపోటుకు గురై మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.