ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ రామజోగి పేట గ్రామ యువకుల అభ్యర్ధన మేరకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మొదలవలస చిరంజీవి తన స్వంత నిధులు సుమారు 13, 000/- విలువైన క్రికెట్ మరియు వాలీ బాల్ కిట్లను యువకులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువత కు దేహధారుడ్యాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక వికాశాన్ని ఐక్యత స్ఫూర్తిని ఇస్తాయని యువకులు క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ బెండు రామారావు మండల విప్ బగ్గు రాజారావు వైసీపీ నాయకులు అల్లు సూర్యనారాయణ, అరసవిల్లి రామారావు యువత తదితరులు పాల్గొన్నారు.