బాబాయ్‌ని లేపేసిన ఒక ఎంపీ అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని, మరో ఎంపీ జిప్పువిప్పి ఇండియా మొత్తం చూపించారని ఆరోపించారు. ఇంకో ఎంపీ యూట్యూబ్ వీడియో లు, రీల్స్ చేస్తూ పూలు చల్లమని అడుక్కుంటున్నాడని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కొడుకుని కాపాడుకునే పనిలో ఇంకో ఎంపీ బిజీగా ఉన్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మరొక ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయారన్నారు. వీరంతా కలసి ఎంపీ అవినాశరెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి చంచల్‌గూడ జైలులో ప్రత్యేక ఖైదీ హోదా సాధించారని ఎద్దేవా చేశారు. జగన చెత్త పాలన గురించి తాము చెప్పాల్సిన అవసరం లేదని, వైసీపీ ఎమ్మెల్యేలే నడి బజారులో ఆయన పరువు తీస్తున్నారన్నారు.