జగన్నాధస్వామి రథయాత్రలో భాగంగా గడచిన ఎనిమిది రోజులుగా వివిధ దేవుళ్ల అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాధ స్వామివారు, తొమ్మిదవరోజైన బుధవారం విష్ణుమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. దీంతో భక్తులు నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలోగల జగన్నాధస్వామిని అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.