పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఉన్నాయంటూ టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ఒకే డోర్ నంబర్‌పై పదుల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు ఐయ్యాయని తెలిపారు. ఈ సంద్రాభంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల కమిషన నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు అడ్డగోలుగా దొంగ ఓట్లు నమోదు చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి, వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేశారన్న అరోపణలున్నాయి. నరసరావుపేట మున్సిపాలిటీలో ప్రకాష్ నగర్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన 163 పరిధిలో డోర్ నంబరు 1-1లో 243 ఓట్లు నమోదయ్యాయి. పాతూరు ప్రాంతంలోని 126 పోలింగ్ స్టేషన పరిధిలో డోర్ నంబరు 2-15-57/3 లో 148 ఓట్లు ఉన్నాయి. అలాగే పోలింగ్ బూత 166 పరిధిలో డోర్ నంబరు 12-13-6లో 80, 67 పోలింగ్ బూత పరిధిలోని డోర్ నంబరు 2లో 80 ఓట్లు, 233 పోలింగ్ స్టేషన పరిధిలో డోర్ నంబరు 4-123లో 74 ఓట్లు, 158 పోలింగ్ బూత పరిధిలోని డోర్ నంబరు 1-1-1లో 68, 231 పోలింగ్ స్టేషన పరిధిలో డోర్ నంబరు 1లో 62 ఓట్లు నమోదయ్యాయని తెలియజేసారు.