సీఎం జగనకు ఒత్తులూ రావు.. దీర్ఘాలూ రావు.. వరాహికి, వారాహికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు, అందుకే జనసేన వయోజన సంచార పాఠశాల ఏర్పాటు చేసి భవిష్యతలో ఆయనకు నేర్పిద్దాం. అని జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్ వ్యగ్యాస్త్రాలు వదిలారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఒక నియంత, ఒక కంటకుడు, తెలుగు అక్షరాలు రాని వ్యక్తి పాలనలో అంతా బాధపడుతున్నారని అన్నారు. ‘ఎక్కువగా మాట్లాడగలను.. అయినా శుక్రవారం ఇక్కడే బహిరంగ సభలో మాట్లాడాలి. అప్పటిలోగా వైసీపీ వాళ్లు అనేక తప్పులు చేస్తారు. నేను ఊగిపోతూ మాట్లాడతానని ముఖ్యమంత్రి బాధపడుతున్నారు. ఈసారి నుంచి అలా మాట్లాడను. ముఖ్యమంత్రి హావభావాలను అనునయిస్తూ అలాగే మాట్లాడతా’ అని ఎద్దేవాచేశారు.