స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు మళ్లీ పదోన్నతులు ఇవ్వాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇటీవలే పదోన్నతుల ప్రక్రియ ముగియగా... తాజాగా 690 ఎంఈవో పోస్టులను భర్తీ చేయడం, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించడంతో మరోసారి ఈ ప్రక్రియ చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 హెచ్ఎం పోస్టులకు ఈ నెల 30న తాత్కాలిక సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారని, 1, 2 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారని, 3న తుది సీనియారిటీ జాబితా విడుదల చేసి 4న కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపింది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 30న తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారని, 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్కీకరిస్తారని, 4న తుది సీనియారిటీ జాబితా విడుదల చేసి, 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపింది. అయితే స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల్లో భాషా సబ్జెక్టులు లేవని స్పష్టం చేసింది.