రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల ఇన్చార్జుల పనితీరుపై లోతుగా విశ్లేషణలు చేయడంతోపాటు ఇంకా ఖరారు కాకుండా మిగిలిపోయిన స్థానాల్లో ఇన్చార్జుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. ఆయా చోట్ల తగాదాల పరిష్కారంపైనా దృష్టి పెట్టారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇన్చార్జులు లేదా అక్కడున్న త్రిసభ్య కమిటీలతో ఇప్పటికే ఒక దఫా సమావేశాలు పూర్తి చేసిన ఆయన.. వారితో రెండో విడత సమావేశాలు కూడా మొదలుపెట్టారు. అవి కూడా 43 నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. ఆయా స్థానాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే బలాబలాలు, ఇన్చార్జి పనితీరు, ప్రజాభిప్రాయం, ఇంకా అక్కడ దృష్టి సారించాల్సిన అంశాలపై వారితో విపులంగా చర్చిస్తున్నారు. లోపాలుంటే ఎత్తిచూపిస్తున్నారు.