ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాపట్ల పార్లమెంట్ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గురువారం ఆయన ఉద్దండరాయుని పాలెం లోని ఎంపీ నివాసంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. పలు సమస్యలు వెంటనే ఫోన్ ద్వారా పరిష్కరించారు. ఇతరుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు.