డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ పై బ్లేడుతో దాడి చేసి గొంతుకోసేందుకు యత్నించిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. గొంట్ల గణేష్ అనే విద్యార్థి స్థానిక సాహితి జూనియర్ కాలేజీలో గత ఏడాది ఇంటర్ పరీక్షలు రాస్తూ కాపీయింగ్ పాల్పడటంతో స్వ్కాడ్ డీబార్ చేసింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ కొండారెడ్డిపై కక్ష పెంచుకొని, గురువారం రాత్రి బ్లేడుతో మెడ, చేతిపై దాడి చేసి పారిపోయాడు.