దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్ నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. జులై 1 నుండి యాత్ర ప్రారంభం కానుండడంతో పెద్ద ఎత్తున సాధువులతో పాటు 1,500 మందికి పైగా యాత్రికులు జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. దీంతో అధికారులు జమ్ము షాలీమార్ ప్రాంతంలో స్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాధువుల కోసం మరో ప్రత్యేక కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు.