పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ నాయకుడుఅంటూ ఎద్దేవా చేశారు. రాజాకీయాల్లో చంద్రబాబుకి డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారిపోయాడంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే వీళ్లకు ఏపీ గుర్తొస్తుంది. ఎన్నికలప్పుడు చలో ఏపీ.. ఎన్నికలయ్యాక చలో హైద్రాబాద్ అంటూ విమర్శించారు.